భారతదేశం, సెప్టెంబర్ 27 -- హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో 'ది ప్యారడైజ్' చిత్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీక్షించారు. సినిమా ప్రదర్శన అనంతరం థియేటర్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. సమాజంలో అణచివేత, అన్యాయం ఎదురైనప్పుడు ఆ సమాజం తన అస్తిత్వ పరిరక్షణ కోసం ఏ విధంగా పోరాడుతుందో ఈ సినిమాలో అద్భుతంగా చూపించారని పేర్కొన్నారు.

"ఒక సమాజం న్యాయం కోసం గళమెత్తే తీరును, అణచివేతకు గురైన ప్రజల పక్షాన ఒక నాయకుడు నిలబడి వారిని ముందడుగు వేయించిన తీరును దర్శకుడు అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించారు" అని కేటీఆర్ వివరించారు.

తెలంగాణ నేల స్వభావానికి, ఇక్కడి సహజసిద్ధమైన యాస, భాష, సంస్కృతికి అద్దం పడుతూ ఈ చిత్రాన్ని ఒక గొప్ప దృశ్య కావ్యంలా మలిచారని చెప్పారు. అణచివేతకు గురైనప్పుడు సామాన్య ప్రజలు ఏ రీ...