భారతదేశం, ఏప్రిల్ 16 -- KTR Comments On Delimitation : మహిళా రిజర్వేషన్ బిల్లుకు భారత్ రాష్ట్ర సమితి (BRS) మొదటి నుంచి చిత్తశుద్ధితో సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత కోసం అనేక చర్యలు అమలు చేసిన రికార్డు తమకు ఉందన్నారు.

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడమే కాకుండా, అసెంబ్లీ మరియు కౌన్సిల్‌లో ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేసిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా, స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, మార్కెట్ కమిటీల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా మహిళా సాధికారత పట్ల తమకున్న అచంచలమైన నిబద్ధతను చాటుకున్నామని తెలిపారు.

మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనను రాజ్యాంగ సవరణలతో ...