భారతదేశం, జూలై 4 -- Kriti Sanon On Facing Discrimination: సినిమా గ్లామర్ ప్రపంచం పైకి కనిపించే అంత అందంగా ఉండదు. ఇక్కడ రంగుల వెనుక ఎన్నో వివక్షలు, అసమానతలు దాగుంటాయి. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా వెండితెరపై నటీమణులకు ప్రాధాన్యత పెరుగుతున్నా, తెర వెనుక మాత్రం ఇంకా పురుషాధిక్యత నడుస్తోందనేది పచ్చి నిజం అంటారు కొంతమంది హీరోయిన్లు.

తాజాగా ఇదే విషయంపై కృతి సనన్ ఓపెన్ అయ్యారు. ప్రముఖ యూట్యూబర్ లిల్లీ సింగ్ టాక్ షోలో పాల్గొన్న కృతి సనన్ షూటింగ్ సెట్స్‌లో మహిళా నటీమణులు, హీరోయిన్లు ఎదుర్కొనే వివక్షను ఉదాహరణలతో సహా చెప్పుకొచ్చారు.

కృతి సనన్ మోడలింగ్ రంగం నుంచి వచ్చి, ఇంజనీరింగ్ చదివి, ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తానొచ్చిన అన్ని రంగాల కంటే బాలీవుడ్‌లోనే భరించలేనంత ఎక్కువ సవాళ్లు ఎదుర్కొన్నానని కృతి సనన్ చెప్పారు.

కెరీర్ ప్రారంభం...