భారతదేశం, ఆగస్టు 10 -- Korean Kanakaraju Success Celebrations: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ థియేటర్లలో సరికొత్త మేజిక్ రిపీట్ చేస్తూ తన రీసెంట్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు'తో క్లీన్ హిట్ కొట్టేశారు. బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్‌లోనే దంచికొట్టిన ఈ సినిమా.. డిస్ట్రిబ్యూటర్ల థియేట్రికల్ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని పూర్తిస్థాయిలో రికవరీ చేసి గ్రాండ్‌గా లాభాల బాట పట్టింది.

కొద్ది రోజులుగా మంచి మాస్ బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ ఖాతాలో ఈ మూవీ సాలిడ్ కంబ్యాక్‌గా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ ఈ ఘన విజయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయింది.

ఈ భారీ సక్సెస్‌ను ఘనంగా జరుపుకోవడానికి మేకర్స్ రేపు (మంగళవారం, ఆగస్ట్ 11) హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీసీ కోహినూర్ (ITC Kohenur) హోటల్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్‌న...