Komuravelli Railway Station : మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ - కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
భారతదేశం, జూలై 21 -- Komuravelli Railway Station : లక్షలాది మంది భక్తుల ఆరాధ్యదైవం కొమరవెల్లి మల్లన్న స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొమరవెల్లి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ నిర్మించిన "కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్" ప్రారంభానికి ముహుర్తం సిద్ధమైంది. ఈనెల 26వ తేదీన ఈ రైల్వే స్టేషన్ అధికారికంగా ప్రారంభమవుతుంది.
కొమరవెల్లి క్షేత్రానికి రైలు కనెక్టివిటీని పెంచేందుకు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం రూ. 5.63 కోట్ల నిధులను కేటాయించింది. ఇటీవలనే 100 శాతం పనులు పూర్తి కావటంతో.... ఈనెల 26న ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇకపై నేరుగా రైలు మార్గం అందుబాటులోకి వస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.