భారతదేశం, అక్టోబర్ 31 -- Shah Rukh Khan King Overseas Rights Record: భారతీయ సినిమా మార్కెట్‌ను దక్షిణాది పాన్ ఇండియా చిత్రాలు ఏలుతున్నప్పటికీ.. విదేశీ గడ్డపై మాత్రం తనదే పైచేయి అని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మరోసారి నిరూపించారు. షారుఖ్ కథానాయకుడిగా నటిస్తున్న 'కింగ్' చిత్రం విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది.

కింగ్ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.175 కోట్లకు (సుమారు 18 మిలియన్ డాలర్లు) అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక సినిమా ఓవర్సీస్ రైట్స్‌కు ఈ స్థాయి ధరకు క్లోజ్ అవ్వడం ఇదే తొలిసారి.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'కింగ్' ఓవర్సీస్ పంపిణీ బాధ్యతలను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'ఫార్స్ ఫిలిమ్స్' (Phars Films) దక్కించుకుంది. రూ.175 కోట్ల మినిమమ్ గ్యా...