భారతదేశం, నవంబర్ 2 -- Shah Rukh Khan Deepika Padukone King Tu Mil Jaaye Song Released: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ 61వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అద్భుతమైన గిఫ్ట్ అందింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కింగ్' నుంచి మొదటి పాట 'తూ మిల్ జాయే'ను నవంబర్ 2 అర్థరాత్రి విడుదల చేశారు.

బాలీవుడ్ మ్యాజికల్ కాంబో షారుఖ్ - దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ పాట, అందులోని విజువల్స్ యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్, అంతర్జాతీయ పాప్ స్టార్ ఎడ్ షీరన్, మధుబంతి ఈ పాటను పాడగా.. సచిన్-జిగర్ సంగీతం సమకూర్చారు.

"తుపాకీ తూటాల ఘుమఘుమల మధ్య గులాబీలు వికసించే ప్రేమకథ ఇది.. నసీబ్ ఉన్నవారికే ఈ ప్రేమ లభిస్తుంది" అని సోషల్ మీడియా వేదికగా షారుఖ్ ఖాన్ భావోద్వేగంగా రాసుకొచ్చారు. పాట ప్రారంభంలో షారుఖ్, ...