భారతదేశం, మే 11 -- Kiara Advani About Social Media Negativity And Toxic: గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల మీద రూమర్లు రావడం కొత్తేమీ కాదు. కానీ, కొన్నిసార్లు ఆ ప్రచారం హద్దులు దాటి మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. తాజాగా ఇదే అంశంపై స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మనసు విప్పారు.

రాజ్ శమానీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కియారా అద్వానీ సోషల్ మీడియాలో కనిపించే నెగెటివిటీ (Negativity) తనపై ఎలాంటి ప్రభావం చూపిందో వివరించారు. ఒక దశలో ఎదుటివారి అభిప్రాయాలే నిజమని నమ్మే స్థాయికి వెళ్లానని, కానీ ఇప్పుడు తన ఆలోచనా దృక్పథం పూర్తిగా మారిందని కియారా అద్వానీ పేర్కొన్నారు.

సోషల్ మీడియా ప్రభావం గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ.. "ఖాళీ సమయం దొరికినప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తుంటే, నా అల్గారిథమ్‌లో వచ్చే చిన్నపిల్లల వీడియోలు మినహా మిగిలినవన్నీ నెగెటివిటీగానే కనిపిస్తున్నా...