భారతదేశం, సెప్టెంబర్ 10 -- భారత ప్రీమియం ఎస్‌యూవీ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరదీస్తూ దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్, తన మోస్ట్ అవేటెడ్ 7-సీటర్ ఎస్‌యూవీ 'కియా సోరెంటో'ను ఇటీవలే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సోరెంటో డెలివరీలను దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించింది. ఇప్పటికే మార్కెట్లోకి ప్రవేశించిన ఈ ప్రీమియం కారు ప్రారంభ ధరను రూ. 27.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, టాప్ మోడల్ ధర రూ. 40.39 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కియా ఇండియా పోర్ట్‌ఫోలియోలోనే మొట్టమొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్‌గా 'సోరెంటో' అడుగుపెట్టడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న కియా అత్యాధునిక తయారీ కేంద్రంలోనే ఈ భారత్-స్పెసిఫిక్ సోరెంటో ఎస్​యూవీని రెడీ చేస్తున్నారు. రూ. 25వేల టోకెన్ అమోంట్​తో బుకింగ్స్ ఇప్పటికే మొదలైన విష...