భారతదేశం, ఏప్రిల్ 12 -- 2027 Kia Sonet : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్, బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో ఒకటి.. కియా సోనెట్. ఇక ఇప్పుడు ఈ ఎస్​యూవీకి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని తీసుకొచ్చేందుకు కియా మోటార్స్ సంస్థ ప్లాన్​ చేస్తోంది. 2027లో మార్కెట్​లోకి రానున్న ఈ కొత్త తరం సోనెట్ (కోడ్ నేమ్: QY2E), డిజైన్ పరంగానే కాకుండా సాంకేతికత పరంగా కూడా భారీ మార్పులతో రాబోతోందని సమాచారం.

కియా సోనెట్ తొలిసారిగా సెప్టెంబర్ 2020లో విడుదలై, జనవరి 2024లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అందుకుంది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయి కొత్త మోడల్‌తో వినియోగదారులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి.

ప్రస్తుతం సోనెట్ కే2 అనే ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తుండగా, కొత్త మోడల్ కే1 ప్లాట్‌ఫారమ్‌కు మారన...