భారతదేశం, ఆగస్టు 13 -- Kherrub First Look Poster Released: తెలుగు చిత్ర పరిశ్రమలో వినూత్న కథాంశాలతో వచ్చే సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. అదే బాటలో ఒక సరికొత్త ఫాంటసీ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది 'కెరూబ్' సినిమా.

విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ కెరూబ్ చిత్రాన్ని ఖుషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నిర్మాత బాలు బల్లెకారి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దర్శకుడు ఎంజె నాయుడు (జీవన్) ఈ కెరూబ్ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇప్పటికే నిర్మాణంతర పనులు పూర్తిచేసుకొని ఫస్ట్ కాపీతో సిద్ధమైన కెరూబ్ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే సెప్టెంబర్ నెలలో చిత్రాని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు దర...