భారతదేశం, సెప్టెంబర్ 25 -- Khairatabad Ganesh Immersion 2026 : ఖైరతాబాద్‌ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి అయింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌ 4 వద్ద మహాగణపతి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ ఏడాది 69 అడుగుల భారీ ఎత్తులో 'పంచముఖ సంకటహర మహాగణపతి'గా దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు.

శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయానికి ఖైరతాబాద్‌లోని మంటపం నుంచి శోభాయాత్ర అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు ఈ శోభాయాత్ర సాగింది. దారిపొడవునా భక్తులు చల్లిన పూలవర్షం, శివసత్తుల పూనకాలు, దప్పుల వాయిద్యాలు, కోలాటాలు ఆకట...