భారతదేశం, అక్టోబర్ 17 -- Keerthy Suresh: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'జనవరి 12 విడుదల'. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ నుంచి కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇవాళ (అక్టోబర్ 17) కీర్తి సురేష్ బర్త్ డే. ఈ సందర్భంగా జనవరి 12 విడుదల సినిమాలో ఆమె క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 'బావ బామ్మర్ది సౌజన్యంతో' అనే క్యాచీ ట్యాగ్‌...