భారతదేశం, ఆగస్టు 18 -- హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ పరిధిలోని కాసు బ్రహ్మానంద రెడ్డి(KBR) నేషనల్ పార్క్ చుట్టూ ప్రయాణించే వాహనదారులకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 18 మంగళవారం నుండి ఈ ప్రాంతంలో వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. రూ. 1,090 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(H-CITI) ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ఈ మార్పులు చేశారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు దాదాపు ఏడాదిన్నర (18 నెలలు) పాటు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

ప్రయాణికులు తమ గమ్యస్థానాలను సులభంగా చేరుకోవడానికి, అయోమయానికి గురికాకుండా ఉండటానికి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక లేన్ మార్కింగ్‌లు, లేన్ ఛేంజర్లను ఏర్పాటు చేశారు. ప్రతి రెండు జంక్షన్ల మధ్య ఒక లేన్ ఛేంజర్ అందుబాటులో ఉంటుంది.

ఇద...