భారతదేశం, నవంబర్ 23 -- అత్యంత పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఇక కార్తీక పౌర్ణమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమిని నవంబర్ 24 నాడు జరుపుకొంటున్నారు. పంచాంగం ప్రకారం, పౌర్ణమి తిథి నవంబర్ 23న రాత్రి 11:42 గంటలకు ప్రారంభమై, నవంబర్ 24న రాత్రి 8:23 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథి ఆధారంగా నవంబర్ 24 నాడే కార్తీక పౌర్ణమి. ప్రదోష కాలమైన సాయంత్రం 5:08 నుండి 7:47 గంటల మధ్య దీపాలు వెలిగించడానికి, ప్రత్యేక పూజలు చేయడానికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన సమయం.

పురాణాల ప్రకారం.. తారకాసురుని ముగ్గురు కుమారులైన త్రిపురాసురులు మూడు లోకాలలో బీభత్సం సృష్టిస్తూ ఉండేవారు. కార్తీక పౌర్ణమి రోజున, పరమేశ్వరుడు ఒక్క బాణంతో త్రిపురాసురను సంహరించి దేవతలను రక్షించాడు. ఈ విజయానికి ప్రతీకగా శివుడిని త్రిపురారిగా పూజిస్తారు. త్రిపు...