భారతదేశం, అక్టోబర్ 17 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో మాలిని దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న ఒంటిమీద ఒక్క గీత పెట్టకుండా ఇంత సేఫ్‌గా ఎలా పంపించావ్ అత్తా అని అడుగుతుంది. దానికి మాలిని షాక్ అవుతుంది. నేనంటే నీకు అంత ప్రేమ అని జ్యో అంటుంది.

ఏం మాట్లాడుతున్నావని మాలిని అంటుంది. ఎవరో వచ్చి నన్ను తీసుకుపోయారు. ఎక్కడో దాచారు. రాత్రి తీసుకొచ్చి నడిరోడ్డులో కళ్లకు గంతలు కట్టి వదిలేశారు. కంటికి కనిపించకపోయినా జరిగిందంతా చేయించింది నువ్వే అని నాకు తెలియదనుకున్నావా. భయపడ్డావా.. నీ కొడుక్కి. నేను కనిపించకపోతే నీ కొడుకు మర్చిపోతాడనుకున్నావ్. కానీ నాకోసం ఇంతలా తిరుగుతున్నాడనుకోలేదు. దొరికిపోయావ్ అత్త అని జ్యో అంటుంది.

నన్ను లేకుండా చేయాల్సిన అవసరం నీకు తప్పా ఎవరు లేదు. ఇక్కడ నీ కొడుకు నిన్ను అనుమానించడం భరించలేకపో...