భారతదేశం, ఏప్రిల్ 11 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో మ్యారేజ్ గిఫ్ట్ అని చెప్పి కార్తీక్ చేతిలో తాళి పెడుతుంది జ్యోత్స్న. తాళి తన మెడలో కట్టి తననే బహుమతిగా తీసుకో అని అంటుంది జ్యోత్స్న. ఇందులో విశేషం ఏంటంటే నీ మొదటి పెళ్లి రోజు నాడే నీకు రెండో పెళ్లి అని జ్యో అంటుంది. కార్తీక్ తెగ షాక్ అయిపోతాడు.

ఇదంతా నేను నైట్ ప్లాన్ చేసుకున్నా. అందుకే నీకోసం చీర కట్టుకుని వచ్చాను. సంగీతం, వాయిద్యాలు, ముహుర్తాలు లేవని ఆగిపోవద్దు బావ. నువ్వే నా మెడలో తాళి కట్టు. అన్ని సమస్యలకు ఇంతకంటే మంచి పరిష్కారం ఎవరు చెప్పరు. ఇది మన పెళ్లి కానుక అని దీపకు పరిచయం చేయి. చాలా సర్‌ప్రైజ్ అవుతుందని జ్యోత్స్న అంటుంది. ఇక ఆపుతావా అని కార్తీక్ అంటే.. ఇది డ్రామా అనుకుంటున్నావా అని జ్యో అంటుంది.

డ్రామా కాకపోతే బాగోతం. బాగోతం కాకపోతే...