భారతదేశం, ఆగస్టు 7 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దశరథ వీలునామా గురించి జ్యోత్స్న ఆలోచిస్తుంది. పారిజాతం వెళ్లి పెళ్లికి ఒప్పుకోమంటుంది. ఆస్తికోసం ఆ సూరజ్ గాడిని పెళ్లి చేసుకోలేను. ఆస్తి కోసం, డబ్బు కోసం తలదించలేను. నాకు డబ్బు కావాలి. కానీ, డబ్బంటే ప్రాణం కాదు డబ్బంటే ఇష్టం అని జ్యో అంటుంది.

నేను పెళ్లి చేసుకోకపోయిన ఈ ఆస్తి అంతా నాదే. ఎందుకంటే నేను ఈ ఇంటి వారసురాలిని కాబట్టి అని జ్యోత్స్న అంటుంది. మతిలేకుండా మాట్లాడకు అని పారిజాతం అంటుంది. ఎవరు చెప్పిన వినను. ఇదంతా బావ, దీప ఆడుతున్న నాటకం. ఈ పెళ్లి చేయాలని వాళ్లకెందుకు అంత తాపత్రయం అని జ్యోత్స్న అంటుంది.

ఇది మీ అమ్మ తాపత్రయం, కార్తీక్ దీప కేవలం సాయంగా నిలబడతారు అంతే. ఈ పెళ్లి చేసుకుంటే అందరి మనసులను గెలుస్తావ్ అని పారు అంటుంది. నేను ఓడిపోను. ఎ...