భారతదేశం, మార్చి 30 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో ఆస్తి విషయంలో జ్యోత్స్న పెళ్లి చేసుకోకుంటే కార్తీక్‌కు దక్కాలని క్లాజ్ పెట్టడంపై కాంచన అనుమానిస్తుంది. అలా కండిషన్ పెట్టకుంటే జ్యోత్స్న పెళ్లి చేసుకోదని, రిలాక్స్‌గా ఉంటూ అందరిని ఇబ్బందిపెడుతుందని, జ్యోత్స్న పెళ్లి చేసుకునేందుకే అలా దశరథ్ చేశాడని కార్తీక్ వివరిస్తాడు.

అది మంచిదే అని చెప్పిన కాంచన జ్యోత్స్నను చూస్తుంటే దశరథ్ కూతురు కాదనిపిస్తుందని చెబుతుంది. ఇటీవల హాస్పిటల్‌లో బిడ్డలను మార్చేశారట, కొద్ది రోజులకు టెస్ట్ చేయిస్తే తెలిసిందట. అలానే జ్యోత్స్న కూడా హాస్పిటల్‌లో మారిపోయిందేమే అనిపిస్తుంది కాంచన అంటుంది. దాంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. కానీ, జ్యోత్స్న విషయంలో అలా జరగదులే. ఎందుకంటే వదినను కాపాడింది జ్యోత్స్నే కదా అని కాంచన అంటుంది.

దా...