భారతదేశం, జూలై 25 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న ఓకే చెబితే తన ఆస్తిలో సగం ఆస్తి ఇస్తానని ఆఫర్ ఇస్తుంది మాలిని. అది రెజెక్ట్ చేసిన జ్యోత్స్న వెళ్లిపోతుంది. ఇంకోసారి నా పెళ్లి గురించి, నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని వెళ్తుంది జ్యోత్స్న.

కాఫీ కప్ టీపాయ్ మీద పెట్టేటప్పుడు కింద బంగారు ఉంగరం కనిపించడంతో కిందకు వంగుతుంది పారిజాతం. దాంతో మెడపట్టి ఊడిపోయి నొప్పి పోతుంది. మాలిని నీ ఉంగరం నా మెడనొప్పిని తగ్గించింది అని సంతోషంగా చెబుతుంది పారిజాతం. ఆ ఉంగరాన్ని పారిజాతంనే ఉంచుకోమంటుంది మాలిని. చాలా విలువ ఉంటుందనుకుంటా అని పారు అంటుంది.

అడగ్గానే నా మేనకోడలిని తీసుకొచ్చావ్. నా గుర్తుగా ఈ ఉంగరం నీ దగ్గరే ఉంచుకో అని మాలిని అంటుంది. నేను ఇలాంటివాటికోసం రాలేదు. నువ్ అడగ్గానే పాత పరిచయం గుర్తొచ్చ...