భారతదేశం, ఆగస్టు 16 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దక్షిణామూర్తి, మాలిని వెళ్లిపోయిన తర్వాత మీటింగ్ నుంచి సూరజ్ బయటకొస్తాడు. కార్తీక్ కూడా వచ్చి సూరజ్‌తో మాట్లాడుతాడు. జ్యోత్స్న ఏంటీ నీ గురించి అలా మాట్లాడేసింది, నిన్ను అంతలా వెనుకేసుకోచ్చిందేంటని కార్తీక్ అంటాడు.

మేమంతా నోరెళ్లబెట్టుకుని చూశాం. నీకు కూడా అలాగే ఉండి ఉంటుంది. అందరిని అల్లాడించేసింది. ఇంకేమైనా అంటే వాళ్లని మీదపడి కొట్టేసేదేమో, అంత దూకుడు చూపించింది అని కార్తీక్ అంటాడు. అదంతా వాళ్ల అత్త మీదున్న కోపమని సూరజ్ అంటే.. ఇంకా నేను నీ మీద ప్రేమ అనుకున్నానే అని కార్తీక్ అంటాడు.

పెళ్లి చేసుకోనని పంతం పట్టిన మనిషి నా మీద ప్రేమ ఎందుకు చూపిస్తుందని సూరజ్ అంటాడు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని కార్తీక్ అడుగుతాడు. అది నీ ఇష్టం అని సూరజ్ అంటాడ...