భారతదేశం, ఆగస్టు 24 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్రను హగ్ చేసుకుని పెళ్లైన తర్వాత మీరంతా నన్ను మర్చిపోతారా అని దిగాలుగా అడుగుతుంది జ్యోత్స్న. అలా ఎందుకు మర్చిపోతామే, నువ్వు సూరజ్ ఇక్కడే ఉంటారుగా అని సుమిత్ర అంటుంది.

పెళ్లయిన తర్వాత ప్రతి ఆడదాని జీవితం మారిపోతుందంటారు. ఒకవేళ నేను వెళ్లే పరిస్థితి వస్తే మీరు నన్ను మర్చిపోతారా, గుర్తు పెట్టుకుంటారా అనిపించిందని జ్యోత్స్న అంటుంది. ఏంటే అన్నావ్.. దానికంటే ముందు నిన్ను ఎంతో ప్రేమగా పెంచాం. పెంచడమేంటీ నువ్వు మా కూతురువి కాదా. ఏదో పరాయి బిడ్డను పెంచుకున్నట్లు అలా అంటావేంటీ అని సుమిత్ర అంటుంది.

జ్యోని ఓదార్చి నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి అని హత్తుకుంటుంది సుమిత్ర. జ్యోత్స్న ఇలా మాట్లాడుతుందేంటని దశరథ్ అంటే..పెళ్లయిన తర్వాత నిజం చెప్పేస్తానని జ్యో...