భారతదేశం, ఆగస్టు 29 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో పగ, ప్రతికారం పురుడు పోసుకుంది నా భర్త చావుతో కాదు. ఈ సుమిత్ర, దశరథల పెళ్లితో. సరిగ్గా ఇప్పుడు జ్యోత్స్న ఎలా పెళ్లికూతురు అయిందో సుమిత్ర కూడా పెళ్లి కూతురు అయినప్పుడు మొదలైందీ ఈ వివాదం అని జరిగింది చెబుతుంది మాలిని.

దశరథతో పెళ్లి చేసుకున్నందుకు సుమిత్రను తండ్రి దక్షిణామూర్తి, వదిన మాలిని, అన్నయ్య కృష్ణమూర్తి కోప్పడుతారు. దశరథ, శివ నారాయణతో గొడవ పడతారు. నీతిలేని బతుకులు అని కృష్ణమూర్తి అంటాడు. సుమిత్రను మాలిని వాళ్ల అన్నయ్యకు ఇద్దామనుకున్నామని కృష్ణమూర్తి మాటిచ్చాడని దక్షిణమూర్తి అంటే.. నా ఇష్టం లేకుండా ఎలా ఇస్తాడని సుమిత్ర కోప్పడుతుంది.

మాలిని తండ్రి కోటీశ్వరుడు. రాజకీయంగా ఎంతో బలం ఉంది అని దక్షిణామూర్తి అంటే.. మనసులో ఇష్టమున్నవాడితో బతికితే స...