భారతదేశం, మే 2 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో శ్రీధర్‌ను కాపాడిన వ్యక్తిని కార్తీక్ కలుస్తాడు. తనను సూరజ్ అని పరిచయం చేసుకుంటాడు. కార్తీక్ చాలా థ్యాంక్స్ అని చెబుతాడు. ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంతలో సూరజ్‌కు కాల్ వస్తుంది. ఏమైందని కార్తీక్ అడుగుతాడు. ఇంపార్టెంట్ మీటింగ్ అని, తన లక్ష్యం అని చెబుతాడు.

అవకాశం కంటే ప్రాణం ముఖ్యం కదా. హాస్పిటల్‌కు తీసుకొచ్చి ఇక ఆయనకు ఏం కాదని తెలిసాక నా మీటింగ్ గుర్తొచ్చిందని సూరజ్ అంటాడు. చాలా రోజుల తర్వాత మనిషిని చూస్తున్నాను. అందరూ స్వార్థం కోసం బతికే ఈరోజుల్లో మీరు చేసింది చాలా గొప్ప పని. రియల్లీ మీరు చాలా గ్రేట్. మిమ్మల్ని చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్లు ఉందని కార్తీక్ చెబుతాడు. అంటే కార్తీక్ లాగే సూరజ్ మనసు ఉందని తెలుస్తోంది. మరింత గొప్పవాన్ని చేయకండ...