భారతదేశం, అక్టోబర్ 15 -- Sundeep Kishan Karikaala Movie Pooja Ceremony: షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమా కరికాల. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. 'కరికాల' మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

'కరికాల' మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న , రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గురువారం (అక్టోబర్ 15, 2026) నాడు కరికాల చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముగ్గురు హీరోయిన్లు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ సందడి చేశారు.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహిధర్ తల్లి పద్మారెడ్డ...