భారతదేశం, ఏప్రిల్ 14 -- ముంబైలోని వాంఖడే స్టేడియం ఆదివారం (ఏప్రిల్ 12) సాయంత్రం తారల మెరుపులతో మెరిసిపోయింది. ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తన భర్త, దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్, కుమారులు తైమూర్, జెహ్‌తో కలిసి హాజరయ్యారు. సైఫ్ పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా వారితో ఉన్నారు. వీరంతా ముంబై ఇండియన్స్ జెర్సీలు ధరించి టీమ్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించారు. అయితే ఈ ఆనందకరమైన వాతావరణంలో ఒక చిన్న ఘటన కరీనా మూడ్‌ను మార్చేసింది.

స్టేడియంలోని లిఫ్ట్ కోసం వేచి చూస్తున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా కరీనా కపూర్ కుటుంబం చుట్టూ చేరారు. సెల్ఫీల కోసం ఎగబడటంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఆ తోపులాటలో కరీనా కపూర్ విపరీతమైన అసహనానికి లోనయ్యారు. తన టీమ్ మెంబర్ లేదా స్టాఫ్ పట్ల కరీనా కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏదో అరవడ...