భారతదేశం, నవంబర్ 1 -- Rana Daggubati Kangana Ranaut Ravi Babu: టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి బాలీవుడ్ వేదికపై ఒక సంచలన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. న్యూఢిల్లీలో హ్యాలోవీన్ సందర్భంగా జరిగిన 'హారర్‌కాన్ ఇండియా 2026' వేదికగా దగ్గుబాటి రానా ఈ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

'స్కేరీ పిక్చర్' పేరుతో రూపుదిద్దుకోనున్న ఒక భారీ హారర్ థ్రిల్లర్ సినిమాను తాను నిర్మిస్తున్నట్లు దగ్గుబాటి రానా వెల్లడించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, భాజపా ఎంపీ, కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు ఈ ప్రాజెక్ట్‌తో హిందీలోకి అడుగుపెడుతున్నారు.

దక్షిణాది నిర్మాతలు పాన్ ఇండియా స్థాయిలో విభిన్నమైన కథలను ప్రోత్సహిస్తున్న తరుణంలో రానా ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపైకి తెచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్, స్పిరిట...