భారతదేశం, ఆగస్టు 24 -- Kangana Ranaut Slams Kriti Sanon Raksha Bandhan: రక్షా బంధన్ పండుగ నేపథ్యంలో ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కోసం బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చేసిన ఒక యాడ్ ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది. సాంప్రదాయ పండుగ వాతావరణంలో సాగే ఈ యాడ్‌లో ఇండో-వెస్ట్రన్ తరహా బోల్డ్ దుస్తులు ధరించడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పండుగ సంస్కృతికి తగినట్లుగా కాకుండా ఇలాంటి దుస్తులు ఎంచుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై కాంట్రవర్సీ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందిస్తూ కృతి సనన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయంపై సుదీర్ఘ పోస్ట్ చేశారు.

"ఈ రోజుల్లో మహిళల దుస్తుల ఎంపికకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. కాక్‌టెయిల్ డ్రెస్సుల నుంచి లెహంగాలు, జీన్స్ నుంచి చీరల వరకు ఎన్నో అందుబాటు...