భారతదేశం, ఏప్రిల్ 13 -- కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్షించి నిర్వహించి.. నిర్దేశించిన సమయంలో పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం అధికారులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు నీటిపారుదల రంగ నిపుణుడు కర్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా కన్వీనర్‌గా స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. నేష‌న‌ల్ డ్యామ్ సేప్టీ అథారిటీ సూచ‌న‌ల మేర‌కు వీలైనంత త్వరగా ఈ ప‌నుల‌ను వేగవంతం చేయాల‌న్నారు. ప్రాజెక్టు మ‌ర‌మ్మమతుల కోసం ప్రత్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించి నిరంత‌రం పర్యవేక్షణ చేయాల‌ని ఈ సందర్భంగా అధికార...