భారతదేశం, నవంబర్ 25 -- పొట్టకూటి కోసం సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు తెలుగు మత్స్యకారుల ఆచూకీ గల్లంతవ్వడం తీర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు ఒడిశా తీరంలోని పారాదీప్ పోర్టు సమీపంలో బోటుతో సహా అదృశ్యమయ్యారు. నవంబర్ 19 నుంచి వారి బోటుతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇప్పటివరకు వారి జాడ తెలియకపోవడంతో మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర విషాదం, ఆందోళన నెలకొన్నాయి.

అధికారులు, మత్స్యకార కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు నవంబర్ 4వ తేదీన ఒక మోటరైజ్డ్ ఫిషింగ్ బోటులో సముద్రంలో వేటకు బయలుదేరారు. నవంబర్ 10న వారు విశాఖపట్నం పోర్టుకు చేరుకుని, అప్పటివరకు పట్టిన చేపలను అక్కడ విక్రయించారు. అనంతరం అదే రోజు మళ్లీ వేట కోసం లోతట్టు సముద్రం...