భారతదేశం, మార్చి 23 -- రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాను కొనియాడగా.. తాజాగా బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ధురంధర్ 2పై రివ్యూ ఇచ్చారు. తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ చిత్రంపై సుదీర్ఘమైన రివ్యూ రాసుకొచ్చారు.

సినిమా చూసిన అనుభూతి నుంచి తాను ఇంకా బయటకు రాలేకపోతున్నానని కాజల్ పేర్కొన్నారు. "ధురంధర్: ది రివెంజ్.. ఆ పేరు వింటేనే ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. రణ్‌వీర్, నువ్వు చేసిన పనికి నేన...