భారతదేశం, జూలై 31 -- Singer K Jamuna Rani Passed Away: భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక అద్భుతమైన మధుర గాత్రం మూగబోయింది. దక్షిణ భారత భాషల్లో తన సుమధుర స్వరంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీతాభిమానులను మైమరపించిన ప్రముఖ సీనియర్ సింగర్ కె. జమునారాణి (కోకా జమునా రాణి) కన్నుమూశారు.

గురువారం (జూలై 30) బెంగళూరులోని తన నివాసంలో జమునారాణి (88) తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ చిత్రసీమలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.

1938 మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జమునారాణికి చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెరిగింది. తండ్రి వరదరాజులు నాయుడు ప్రైవేట్ ఉద్యోగి కాగా, తల్లి ద్రౌపది వయోలిన్ విద్వాంసురాలు. ఇంట్లోనే శాస్త్రీయ సంగీ...