భారతదేశం, జూన్ 27 -- Top 6 Telugu Remakes Of K Bhagyaraj: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో కె. భాగ్యరాజ్ పేరు వినపడగానే సగటు సినిమా అభిమానికి ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన అద్భుతమైన స్క్రీన్‌ప్లే చాతుర్యం. మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలను, భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నచిన్న మనస్పర్థలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఆయన శైలి ప్రత్యేకం.

అందుకే భాగ్యరాజ్‌ను కోలీవుడ్ స్క్రీన్‌ప్లే మాంత్రికుడు అని, కింగ్ ఆఫ్ స్క్రీన్‌ప్లే అని ముద్దుగా పిలుచుకుంటారు. హీరోగా, నటుడిగా, రచయితగా, దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో ఐదు దశబ్దాల పాటు విశేష సేవలు అందించిన కె భాగ్యరాజ్ (73) ఇవాళ (జూన్ 27) ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. దాంతో తెలుగు, తమిళ సినీలోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఈ నేపథ్యంలో భాగ్యరాజ్ నటుడిగా, దర్శకత్వం వహించిన సినిమాల గురించి అందరూ చర్చించుకుంట...