భారతదేశం, మే 16 -- Jyothika About Re Entry Fear And Lady Oriented Movie Budget: టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనదైన నటనతో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ జ్యోతిక. 'చంద్రముఖి'గా తెలుగు ప్రేక్షకులను మెప్పించి, 'ఠాగూర్' సినిమాతో భావోద్వేగాలకు గురిచేసిన జ్యోతిక.. కెరీర్ అగ్రస్థానంలో ఉన్నప్పుడే సినిమాలకు దూరం అయ్యారు.

హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్ ఉన్న సమయంలోనే, 27 ఏళ్ల వయసులో కోస్టార్, హీరో సూర్యను వివాహం చేసుకున్నారు. అనంతరం కుటుంబ బాధ్యతల కోసం జ్యోతిక వెండితెరకు విరామం ప్రకటించారు. అయితే, ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు జ్యోతిక. ఈ నేపథ్యంలో రీ ఎంట్రీపై తన అనుభవాలను, ఆ సమయంలో పడ్డ టెన్షన్‌ను ఓటీటీ మూవీ రిలీజ్ సందర్భంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో జ్యోతిక పంచుకున్నారు.

"ఎనిమిదేళ్ల పాటు కెమెరాకు ద...