భారతదేశం, జూలై 6 -- Jr NTR Trivikram God Of War Controversy: 'ఆర్ఆర్ఆర్', 'దేవర' చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రోజే సంచలనం సృష్టించింది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా కథాంశంపై పొరుగు రాష్ట్రం తమిళనాడులో అప్పుడే వివాదాల మంటలు రాజుకున్నాయి.

తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, నామ్ తమిళర్ కట్చి (NTK) అధినేత సీమాన్ ఈ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. కథలో తమిళ సంస్కృతిని కించపరిచినా, చరిత్రను మార్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ...