భారతదేశం, ఆగస్టు 11 -- Jr NTR Surgery: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఊహించని షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఇటీవల గాయపడిన తారక్ భుజానికి రేపు ( బుధవారం, ఆగస్టు 12) హైదరాబాద్‌లోని ప్రముఖ కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో సర్జరీ జరగనుంది. 'డ్రాగన్' మూవీ షూటింగ్‌లో భుజానికి తీవ్ర గాయం కావడంతో డాక్టర్ల సలహా మేరకు ఈ ఆపరేషన్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ భుజం గాయం తీవ్రతను పరిశీలించిన స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం వెంటనే శస్త్రచికిత్స అవసరమని స్పష్టం చేసింది. దాంతో రేపు ఉదయం ఆయన కిమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ అయి సర్జరీ చేయించుకోనున్నారు.

ఈ విషయాన్ని ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ఇదొక సాధారణ వైద్య ప్రక్రియ మాత్రమేనని, సర్జరీ పూర్తయిన తర్వాత ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ డాక్టర్లు ప్రత్యేక హెల్త్ బులెటి...