భారతదేశం, అక్టోబర్ 3 -- Jr NTR Chuttamalle Song: దేవర' చిత్రంలోని బ్లాక్‌బస్టర్ 'చుట్టమల్లే' పాటను ఏఐతో నీచంగా మార్ఫింగ్ చేశారు. నిజానికి ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ సెన్సేషన్ గా మారింది. అయితే ఇప్పుడు ఏఐని యూజ్ చేసి అత్యంత నీచంగా, అసభ్యకరంగా ఆ వీడియోను మార్ఫ్ చేశారు.

చుట్టమల్లే సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఏఐని వాడి జాన్వీ కపూర్ న్యూడ్ గా ఉన్నట్లు ఆ వీడియో సాంగ్ లో చూపించారు. అదెంతో అసహ్యకరంగా ఉంది. ఈ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్టయ్యారు. సీరియస్ గా దీన్ని క్రియేట్ చేసిన, షేర్ చేస్తున్న వాళ్లకు తారక్ వార్నింగ్ ఇచ్చారు.

''అసహ్యకరం, వికృతం, సిగ్గుచేటు. స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే ఈ దేశంలో, "మాతృదేవో భవ" అనేది కేవలం ఒక పదం మాత్రమే కాకుండా మన సంస్కృతిలో ఒక ...