భారతదేశం, సెప్టెంబర్ 30 -- Jr NTR: మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ మొదటి స్ట్రెయిట్ తెలుగు చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' (Don't Trouble The Trouble). ఈ మూవీ ప్రి-రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ వేడుకలో ఎన్టీఆర్ చేసిన ఎమోషనల్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ సంయుక్తంగా నిర్మించిన మూవీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ స్పీచ్ వైరల్ గా మారింది.

''నన్ను ఒక్కడినే ఎందుకు కన్నావమ్మా అని మా అమ్మను అడుగుతుంటా. నాకు తమ్ముడు అనేవాడు పుట్టి ఉంటే అది కచ్చితంగా కార్తికేయనే. నా కెరీర్‌లో అత్యంత క్ల...