భారతదేశం, ఏప్రిల్ 13 -- John Cena Tribute To Asha Bhosle: భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే (92) ఆదివారం (ఏప్రిల్ 12)ముంబైలో కన్నుమూశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆశా భోంస్లే భౌతికకాయానికి ముంబై పోలీసులు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఆశా భోంస్లే మృతి పట్ల దేశవిదేశాల నుంచి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ హాలీవుడ్ నటుడు జాన్ సీనా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రపంచ ప్రసిద్ధ రెజ్లర్, హాలీవుడ్ హీరో జాన్ సీనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆశా భోంస్లే ఫోటోను షేర్ చేస్తూ ఆమెకు నివాళులర్పించారు. సాధారణంగా సీనా తన పోస్టులకు ఎటువంటి క్యాప్షన్లు ఇవ్వరు. ఈసారి కూడా అలాగే మౌనంగాన...