భారతదేశం, జూలై 22 -- Job Mela in Osmania University 2026 : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక జాబ్ మేళా జరగనుంది. యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో జులై 24వ తేదీన ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

ఈ ప్రకటన ద్వారా 'అపోలో ఫార్మసీ' సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

అపోలో ఫార్మసీ సంస్థలో మొత్తం 100 ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,500 నుంచి రూ.25,000 వరకు వేతనం అందిస్తారు. ఎంపికైన వా...