భారతదేశం, జూన్ 20 -- Job Mela in Osmania University 2026 : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక జాబ్ మేళా జరగనుంది. యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో జూన్ 23వ తేదీన ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ భద్రతా సేవల సంస్థ 'ఫోర్ట్ 9 సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' (Fort 9 Security Services Pvt Ltd) లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 10 ఖాళీలున్నాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాల నుండి 'ఏదైనా డిగ్రీ' ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 26 స...