భారతదేశం, నవంబర్ 11 -- Jithu Madhavan About Suriya Scene Secret Leak: మలయాళంలో 'రోమాంచమ్', 'ఆవేశం' వంటి ఘనవిజయాల తర్వాత తమిళంలోకి అడుగుపెట్టిన దర్శకుడు జిత్తు మాధవన్, స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కించిన చిత్రం 'సీన్'. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలో తాను ఎదుర్కొన్న ఆందోళనలను, ట్విస్టుల లీకేజీ భయాలను ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో జిత్తు మాధవన్ తాజాగా బయటపెట్టారు. ఈ సీన్ సినిమాలో సూర్య డిఎస్పీ ఇన్బరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.

కథలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఆ పాత్ర చూపు లేనిది (అంధుడు). ఈ విషయాన్ని ప్రథమార్ధం చివర వరకు రహస్యంగా ఉంచాలని చిత్ర బృందం భావించింది. అయితే విడుదలకు ముందే ఈ ట్విస్ట్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో తాను ఎంతో ఆందోళ...