భారతదేశం, అక్టోబర్ 26 -- భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన ఐపీఓల్లో ఒకటిగా నిలిచిన జియో ప్లాట్‌ఫామ్స్​కు రికార్డు స్థాయి స్పందన లభించిన విషయం తెలిసిందే. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతు ఉన్న ఈ మెగా ఐపీఓ ఏకంగా 22 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయి దలాల్ స్ట్రీట్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రీటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపీఓ కోసం పోటీపడ్డారు. ఇక ఈరోజు, సోమవారం ఈ జియో ఐపీఓ అలాట్​మెంట్​ ప్రక్రియ జరగనుంది. జియో ఐపీఓకు విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఎన్ని లాట్లు దక్కే అవకాశం ఉంది? షేర్లు రాకపోతే డబ్బులు ఏమవుతాయి? లిస్టింగ్ రోజు ఎలాంటి లాభాలు రావచ్చు? అసలు లిస్టింగ్ ఎప్పుడు? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

సబ్‌స్క్రిప్షన్ రికార్డు స్థాయిలో జరగడంతో, దరఖాస్తు...