భారతదేశం, మే 17 -- Meera Chopra Ambika Supports To Jayam Ravi: 'జెయం', 'పొన్నియిన్ సెల్వన్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి వ్యక్తిగత జీవితం తీవ్ర సంక్షోభంలో పడింది. ఒకవైపు ఆయన స్నేహితురాలు, సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ చెప్పడం, మరోవైపు భార్యతో కోర్టు గొడవలు ఆయనను మానసికంగా కుంగదీశాయి.

చెన్నైలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో జయం రవి కన్నీటి పర్యంతమయ్యారు. విడాకులు ఖరారయ్యే వరకు తాను ఎలాంటి సినిమాల్లో నటించనని, ఏ కొత్త చిత్రాలూ విడుదల కావని స్పష్టం చేశారు. భార్య ఆర్తి రవి తన సొంత పిల్లలను కూడా కలవనివ్వడం లేదని రవి మోహన్ ఆరోపించారు.

తన ప్రెస్ మీట్‌లో రవి మోహన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పెళ్లయిన మొదటి రోజు నుంచే తనకు తీవ్ర అవమానాలు...