భారతదేశం, జూలై 13 -- Jani Master Sekhar Master Chiranjeevi: ఆదివారం (జూలై 12) జరిగిన తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ సమావేశంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగిందనే వార్తలు టాలీవుడ్‌లో ఒక్కసారిగా కలకలం రేపాయి.

టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్లుగా దూసుకుపోతున్న వీరిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని, అసోసియేషన్ వేదికగా అది కాస్తా బయటపడిందంటూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు, కథనాలు వైరల్ అయ్యాయి. దీనిపై జానీ మాస్టర్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ అసలు నిజాలను పంచుకున్నారు.

సినిమా సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, శేఖర్ మాస్టర్‌లతో కలిసి దిగిన ఫోటోలను జానీ మాస్టర్ నెట్టింట షేర్ చేస్తూ రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

"గత రెండు రోజులుగా మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయంటూ కొన్ని తప్పుదోవ పట్టించే వీడ...