భారతదేశం, అక్టోబర్ 18 -- Janhvi Kapoor Sreeleela: హిందీ, తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్లు జాన్వీ కపూర్, శ్రీలీల తొలిసారిగా ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఇంకా అధికారికంగా టైటిల్ నిర్ణయించని ఈ భారీ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌లో సిద్ధార్థ్ గుప్తా (Siddharth Gupta) హీరోగా నటిస్తున్నాడు. 'పగ్లైట్' వంటి ప్రశంసలు పొందిన కల్ట్ సినిమాను అందించిన ఉమేష్ బిష్త్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

జాన్వీ కపూర్, శ్రీలీల కలిసి నటిస్తున్న రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ షురూ అయింది. ప్రకృతి అందాలకు నిలయమైన ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ (Nainital) కొండప్రాంతాలలో ఈ సినిమా తొలి షూటింగ్ షెడ్యూల్‌ను మేకర్స్ ప్రారంభించారు. ప్రస్తుతం లొకేషన్‌లలో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తు...