భారతదేశం, మార్చి 3 -- సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద వచ్చే ట్రోలింగ్, విమర్శలు ఈ మధ్య హద్దులు దాటుతున్నాయి. దీనిపై బాలీవుడ్ బ్యూటీ, పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా మనసు విప్పారు.

ఇంటర్నెట్‌లో వ్యక్తం అయ్యే అభిప్రాయాలను తాను పెద్దగా పట్టించుకోనని, అయితే తన సోదరుడు అర్జున్ కపూర్‌ను టార్గెట్ చేస్తూ సాగుతున్న వేధింపులకు మాత్రం ఎలాంటి సాకులు ఉండవని ఆమె కుండబద్దలు కొట్టారు. 'గ్రేజియా'కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సోషల్ మీడియా వేధింపుల వెనుక ఉన్న అసలు కోణాన్ని జాన్వీ కపూర్ విశ్లేషించారు.

సోషల్ మీడియా సంస్కృతి గురించి జాన్వీ కపూర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ పాపులారిటీ, వ్యూస్ కావాలి. అందుకే సెలబ్రిటీల గురించి కంటెంట్ చేసేటప్పుడు మమ్మల్ని కేవలం ఒక 'పావు' లేదా బలి పశువు (Scapegoat) లాగా వాడుకుంటున...