భారతదేశం, జూలై 24 -- Jana Nayagan OTT Release Details: తమిళ స్టార్ హీరో, సీఎం దళపతి విజయ్ నటించిన లాస్ట్ సినిమా 'జన నాయగన్'. తెలుగులో 'జన నాయకుడు'. విజయ్ పూర్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు నటించిన ఈ సినిమా 7 నెలల ఆలస్యంతో ఎట్టకేలకు నిన్న (జూలై 23) థియేటర్లలో విడుదల అయింది.

హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. తమిళనాడులో విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ శ్రేణులు, అభిమానుల పండుగ వాతావరణం నడుమ ఈ సినిమా కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి.

తెలుగులో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చి సంచలన విజయం సాధించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి ఇది అధికారిక తమిళ రీమేక్. బాలయ్య పోషించిన పవర్ ఫుల్ క్యారెక్టర్‌ను...