భారతదేశం, జూలై 24 -- Jana Nayagan 1st Day Worldwide Box Office Collection: తమిళనాడు సీఎం, దళపతి విజయ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ వచ్చిన ఆఖరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan). సెన్సార్ అడ్డంకులతో దాదాపు ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి నిన్న (జూలై 23) వచ్చింది.

దళపతి విజయ్ పూర్తిస్థాయి రాజకీయనాయకుడిగా మారే ముందు వచ్చిన చివరి సినిమా కావడంతో అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఆకాశాన్నంటే అంచనాలు నెలకొన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రికార్డు కలెక్షన్లు సాధించలేకపోయింది.

తమిళనాడు వ్యాప్తంగా హౌస్‌ఫుల్ బోర్డులతో బోణీ కొట్టినప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రభావం చాలా తక్కువగా కనిపించింది. భారత బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ. 41 కోట్ల నెట్ (రూ. 48 కోట్ల గ్రాస్)...