భారతదేశం, జూన్ 1 -- Jagapathi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. జూన్ 4న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. లేటెస్ట్ గా విజయవాడలో 'పెద్ది గ్రాండ్ రోర్' పేరుతో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మెగా ఫ్యాన్స్ కోలాహలం మధ్య జరిగిన ఈ వేడుకలో, టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో, ఫ్యాన్స్ లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో 'అప్పలసూరి' అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న జగపతి బాబు.. స్టేజ్ పై మాట్లాడుతూ విజయవాడతో తనకున్న ఎమోషనల్ బాండింగ్ ని గుర్తుచేసుకున్నారు.

"నేను పుట్టింది ఈ బెజవాడ గడ్డ మీదే. బెంజ్ సర్కిల్ ద...